రాష్ట్ర రాజధాని శివారులో పట్టపగలే దారుణం చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లా పూర్‌మెట్ తహసీల్దార్ చెరుకూరి విజయారెడ్డి ఆమె కార్యాలయం లోనే సోమవారం హత్యకు గురయ్యారు. పట్టాదారు పాసుపుస్త కాల్లో తమకు బదులుగా కౌలుదార్ల పేర్లను చేర్చారన్న కోపంతో కూర సురేశ్ అనే రైతు ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించి సజీవ దహనం చేశాడు. తమ కుటుంబాలకు దక్కాల్సిన భూమిని తమకు దక్కకుండా చేస్తున్నారని కక్షగట్టి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.
#MROVijayaReddy
#Abdullapurmet
#Telangana
#Tehsildar
#hyderabad
#rangareddy
#suresh